హీరోయిన్ అంజలి వెంట లవ్ అని తిరిగాడట

హీరోయిన్ అంజలి వెంట లవ్ అని తిరిగాడట

0

హీరోయిన్ అంజలి అచ్చతెలుగు నటి, అంతేకాదు తెలుగు అమ్మాయి అనే చెప్పాలి.. తమిళ్ లో సక్సెస్ అయిన తర్వాత ఆమె తెలుగులో సినిమా చేశారు.యూత్ హృదయాల్లో అంజలి మంచి స్థానాన్ని సంపాదించుకుంది. సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు సినిమాలో నాకన్నీ అలా తెలిసిపోతాయంతే అనే పాత్ర ఆమెకి చాలా పేరు తెచ్చిపెట్టింది.

అలాంటి అంజలి తాజాగా ఆలీతో సరదాగా కార్యక్రమంలో మాట్లాడుతూ.. నేను పుట్టింది మా నాన్నగారి ఊరైన నర్సాపూర్ లో .. పెరిగింది మా అమ్మగారి ఊరైన రాజోలు’లో అని చెప్పింది. మొత్తానికి ఆమెది తూర్పుగోదావరి జిల్లా రాజోలు, తనకు తన బామ్మ పేరు పెట్టారట, అయితేముద్దుగా ఆమెని బేబి అని పిలిచేవారట.

ఇక జూనియర్ ఇంటర్ వరకూఆమె రాజోలులోనే చదివారు. ఆ తరువాత చెన్నైకి వెళ్లిపోయింది.. ఆ సమయంలో రాజోలులో స్కూల్ డేస్ లో రాము అనే ఒక కుర్రాడు లవ్ చేస్తున్నానంటూ నా వెంటపడేవాడు. ఒక రోజున నేను అతనికి రాఖీ కట్టేశాను. రాఖీనే కదా ఫరవాలేదులే అంటూ ఆ విషయాన్ని కూడా లైట్ గా తీసుకున్నాడు.. అంటూ నవ్వేసింది. తను మళ్లీ కలవలేదు అని చెప్పేసింది అంజలి, ఏదైనా చిన్నతనంలో సరదాలు తెలిసిందేకదా.