హీరో మహేష్ బాబు ఇంటిముందు ఉద్రిక్తత

హీరో మహేష్ బాబు ఇంటిముందు ఉద్రిక్తత

0

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రిన్స్ మహేష్ బాబు ఇంటిని జై ఆంధ్రప్రదేశ్ విద్యార్థి యువజన సంఘాల నేతలు ముట్టడించారు… ఆయన ఇంటి ముందు నినాధాలు చేశారు… అమరావతికి మద్దతు ఇవ్వాలంటూ వారు నిరసనలు చేశారు…

ఈనెల 19 వరకు హీరోల ఇళ్లన్నీ ముట్టడిస్తామని హెచ్చరించారు… హీరోలందరూ ఏపీ రాజధాని అమరావతికి మద్దతు ఇవ్వాలని కొరారు… కాగా కొద్దికాలంగా ఏపీలో మూడు రాజధానుల వ్యావహారం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే…

రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అమరావతి రైతులు రోడ్డెక్కారు… కాగా మరో వైపు ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో ,చిరంజీవి అధికార వికేంద్రీకరణకు జైకొట్టిన సంగతి తెలిసింది…

మరోవైపు మహేష్ బాబు నటించిన చిత్రం సరిలేరు నీకెవ్వరు చిత్రం సంక్రాంతి కానుకగా రేపు విడుదల అవుతోంది… అలాంటి సమయంలో విద్యార్థులు ఆయన ఇంటిముందు నిరసనలకు దిగడం గమనార్హం….