చంద్రబాబుకు షాకిచ్చిన హై కోర్టు

చంద్రబాబుకు షాకిచ్చిన హై కోర్టు

0

ఓ కేసు విషయంలో చంద్రబాబునాయుడుకు హై కోర్టు పెద్ద షాకే ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి నవరత్నాల్లో హామీల్లో ఒకటి అమలు కాకుండా చంద్రబాబు చేసిన ప్రయత్నాన్ని కోర్టు కొట్టేసింది. గ్రామ వాలంటీర్ల నియామకాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వటం దానికి ఆశావహులు దరఖాస్తులు చేసుకోవటం కూడా అందరికీ తెలిసిందే.
దాదాపు 9.85 లక్షల దరఖాస్తులొస్తే అందులో సుమారు 9.1 లక్షల మందిని ఇంటర్య్వూ చేయటానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఇంటర్వ్యూలకు ప్రభుత్వం తేదీలను కూడా ప్రకటించేసింది. ఈ దశలో ప్రభుత్వ ప్రయత్నాలను నిలపాలంటూ గుంటూరుకు చెందిన ఇద్దరు కోర్టులో కేసు వేశారు.

ఇంటర్వ్యూల ద్వారా గ్రామ వాలంటీర్లను ఎంపిక చేయటం అన్యాయం అనేది వాళ్ళిద్దరి వాదన.సరే వాళ్ళ వాదనను కోర్టు కొట్టేసిందనుకోండి అది వేరే సంగతి. దాంతో ప్రభుత్వం ఇంటర్వ్యూలు కండక్ట్ చేయటానికి కోర్టు ద్వారా లైన్ క్లియర్ అయ్యింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పిటీషనర్ల తరపున వాదించింది దమ్మాలపాటి శ్రీనివాస్. చంద్రబాబుకు దమ్మాలపాటి బాగా సన్నిహితుడు. చంద్రబాబు హయాంలో దమ్మాలపాటి ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ గా కూడా పనిచేశారు