హిట్ సినిమా సీక్వెల్ కు బాలయ్య గ్రీన్ సిగ్నల్

హిట్ సినిమా సీక్వెల్ కు బాలయ్య గ్రీన్ సిగ్నల్

0

బాలయ్య బాబు సినిమాలు ఎవర్ గ్రీన్ అంటే చాలా ఉన్నాయి అని చెప్పాలి.. తాజాగా వస్తున్న చిత్రాల సరళి వేరు, అయితే గత చిత్రాల సరళి వేరు. ఆయన మాస్ ప్రేక్షకులకు దగ్గర అయిన సినిమాలు చాలానే ఉన్నాయి.. తాజాగా ఆయన తన పాత చిత్రాల పేర్లు చెబితే ఆదిత్య 369 పేరు ముందు చెప్పుకోవాలి…బాలకృష్ణ కెరియర్లో చెప్పుకోదగిన చిత్రాల జాబితాలో ఆదిత్య 369 ముందు ఉంటుంది.

ఈ సినిమాని ప్రముఖ సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించారు.. ఇప్పటికీ ఈ సినిమా అంటే టీవీల ముందు కూర్చుని చూస్తారు… ఈ సినిమాకి సీక్వెల్ రూపొందనున్నట్టుగా 2018 నుంచి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.. ఈ సినిమాకి ఆదిత్య 999 అనే టైటిల్ ను ఖరారు చేసినట్టుగా చెప్పుకున్నారు. అయితే దీని గురించి ఈ మధ్య పెద్దగా చర్చ జరగలేదు.

అయితే బాలయ్య బాబు తాజాగా ఇంటర్వ్యూలో పలు విషయాలు మీడియా ముఖంగా పంచుకున్నారు… ఆదిత్య 369 కి సీక్వెల్ చేయాలనీ నాకూ వుంది. ఒకరోజు రాత్రి అనుకోకుండా ఈ సీక్వెల్ కి సంబంధించిన కథ ఏమిటనేది తట్టింది. ఆ కథకు కార్యరూపాన్ని ఇవ్వవలసి వుంది. ఈ సినిమాకి నేనే దర్శకుడిగా వ్యవహరించే అవకాశం వుంది అని ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఈ సినిమాకి బాలయ్య కథ కోసం వర్క్ అయితే చేస్తున్నారు అనే చెప్పుకోవాలి, త్వరలో ఈ సినిమా స్వయంగా ఆయనే పట్టాలెక్కించనున్నారట. అభిమానులకు ఇది పండుగ లాంటి వార్తే.