బూడిద గుమ్మడికాయ ఆరోగ్యానికి ఎలా పనిచేస్తుంది దాని రసం లాభాలు

0
బూడిద గుమ్మడికాయ తెలియని వారు ఉండరు.. ప్రతీ పల్లెల్లో ఈ పాదులు కనిపిస్తాయి, ఇక ఇంటికి గుమ్మానికి కడతారు. కొత్త  షాపులు ఇళ్లు ఫ్యాక్టరీలు ఇలా ఏవి కొత్త కార్యక్రమాలు చేసినా అక్కడ గుమ్మడికాయ కనిపిస్తుంది.. అంతేకాదు ఇక వంటల్లో కూడా దీనిని చెప్పుకోవాలి.. గుమ్మడికాయ వడియాలు చాలా మంది తీసుకుంటారు..పప్పు ఆవకాయ గుమ్మడికాయ వడియాలు నెయ్యి ఇక ఆ టేస్ట్ సూపర్ ఉంటుంది అంటారు ఎవరైనా.
ఈ కాలంలో ఏ దిష్టీ తగలకూడదనీ బూడిద గుమ్మడి ఇంటి ద్వారానికి కడతాం. ఇక మీకు తెలుసా ఇందులో ఉండే రసం గింజలు ఆ గుమ్మడికాయ ముక్కలు కూడా శరీరానికి చాలా మంచిది.. కడుపులో గ్యాస్ నొప్పి దూరం కావాలంటే బూడిద గుమ్మడి కాయ రసం తాగాలి. కడుపులో ఉబ్బరాన్ని తగ్గించే గుణాలు ఈ రసంలో ఉన్నాయి. అప్పుడప్పుడూ ఇది తీసుకున్నా మీకు అనారోగ్య సమస్యలు ఉంటే తగ్గిపోతాయి.
బూడిదగుమ్మడిలో 96% ప్రధానంగా నీటితో నిండి ఉంటుంది…ఇందులో ఎక్కువగా విటమిన్ సీ ఉంటుంది..
నియాసిన్, థయామిన్, రిబోఫ్లావిన్ వంటి B-కాంప్లెక్స్ విటమిన్లు ఇందులో ఉంటాయి. ఐరన్, పొటాషియం, జింక్, కాల్షియం  మెగ్నీషియం ఇలాంటి మినరల్స్ ఉంటాయి,  ఇక పీచు పదార్దం కూడా, సో అందుకే ఇవి అప్పుడప్పుడూ తీసుకున్నా చాలా మంచిది. మలబద్దకం ఉన్నా ఈ రసం తాగితే చాలా మంచిది తగ్గుతుంది.
నోట్ ..
కొందరికి  ఇది రసంగా వడియాలుగా ముక్కలుగా విత్తనాలుగా తీసుకుంటే శరీరానికి  పడకపోవచ్చు అలాంటి వారు  వైద్యుల సలహాతో  దీనిని తీసుకోవడం మంచిది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here