బెడ్ షీట్లు – దిండ్లు ఎన్ని రోజులకి ఓసారి మార్చాలి – మార్చ‌క‌పోతే ఎంత డేంజ‌రో తెలుసా

How Many Days Should Pillows and Bed Sheets Be Changed?

0

ఉదయం అంతా కష్టపడి సాయంత్రం నిద్రలోకి వెళతాం. మళ్లీ ఉదయం మన పని మనం చేసుకుంటాం. ఎంత డబ్బు సంపాదించినా సుఖంగా నిద్రపట్టాలి అంటారు పెద్దలు. అయితే మనం పడుకునే సమయంలో బెడ్ షీట్లు, దిండ్ల పిల్లో కవర్స్ తరచూ మార్చుకుంటూ ఉండాలి. లేకపోతే అనేక అనారోగ్య సమస్యలు మనల్ని వెంటాడతాయి.

మంచం పై దిండ్లు ఎక్కువ రోజులు వాడితే ఆరోగ్యాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది. చాలా మంది దిండ్లు అలాగే ఉంచి వాటిపై కవర్లు మారుస్తూ ఉంటారు. అయితే ఆదిండులు కూడా కొంత కాలం వాడి వాటి స్ధానంలో కొత్తవి కొనాలి అని చెబుతున్నారు నిపుణులు
.కనీసం రెండు సంవత్సరాలకు ఒక్కసారైనా దిండ్లు మార్చాలి. మనం వాటిని అలా ఉంచి వాడితే అందులో బ్యాక్టీరియా ఉంటుంది. దుమ్ము, ధూళి మనం పడుకున్న సమయంలో అదంతా వాటి నుంచి మనకు అంటుకోవడం మన నుంచి వాటికి రావడం జరుగుతుంది.

అంతేకాదు మనకు చెమట పడితే అది కూడా ఆ దిండ్లకు అంటుకుంటుంది. దీని వల్ల దిండు లోకి సూక్ష్మక్రిములు కూడా పెరుగుతాయి. అందుకే ప్రతీ పదిరోజులకి ఓసారి అయినా ఆ దిండుని ఎండలో వేయాలి. మనం త‌ల‌కు ప‌ట్టించుకున్న నూనె చెమట ఇదంతా ఆ దిండ్ల పై పడుతుంది. ఇది అంతా బ్యాక్టిరియా పెరగడానికి కారణం అవుతుంది. ఇక బెడ్ షీట్లు కూడా కచ్చితంగా ఆరు నెలలకి ఓసారి కొత్త‌వి మార్చాలి. బెడ్ పై మాత్రం ప్రతీ వారం క‌చ్చితంగా ఉతికి మ‌ళ్లీ వాడుకోవాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here