రోజుకి ఎన్ని సార్లు  బ్రష్ చేసుకోవాలి – భోజనం అయిన వెంటనే బ్రష్ చేయవచ్చా ?

0
మనం ఉదయం బ్రష్ చేస్తాం అయితే కొందరిని చూస్తు ఉంటాం… ఏదైనా తింటే వెంటనే బ్రష్ చేస్తారు.. మరికొందరు టిఫిన్ భోజనం రాత్రి డిన్నర్  చేశాక కూడా బ్రష్ చేస్తారు… వాస్తవానికి అసలు ఎన్ని సార్లు మనిషి బ్రష్ చేసుకోవాలి… ఇలా చేసుకుంటే పళ్లకి ఏమైనా సమస్యలు వస్తాయా… ఇలాంటి అనుమానాలు  చాలా మందికి ఉంటాయి.
మీరు  భోజనం చేసిన ప్రతిసారి బ్రష్ చేయాల్సిన అవసరం లేదు. ఉదయం, రాత్రి రెండు సార్లు చేస్తే సరిపోతుంది. రోజుకి ఓసారి కాకుండా కచ్చితంగా రెండు సార్లు చేసుకుంటే మీకు నోటిలో ఎలాంటి క్రిములు ఉండవు.. ఉదయానికి మరింత నోరు బాగుంటుంది…మీరు ఇలా రోజుకి నాలుగు ఐదుసార్లు పళ్లుతోమితే,  పళ్ల పైపొర ఎనామిల్ దెబ్బతింటుంది. అది సెన్సిటివిటీ, దంతక్షయానికి దారితీస్తుంది.
ఇక మీరు వాడే బ్రష్ బ్రిసిల్స్ బలంగా గట్టిగా ఉంటే మీ చిగుళ్లు డ్యామేజ్ అవుతాయి, సాఫ్ట్ గా ఉండేవి మాత్రమే వాడాలి.. అయితే ఉదయం కచ్చితంగా ఆరు గంటలకు అలాగే రాత్రి భోజనం చేశాక ఓ 20 నిమిషాల తర్వాత బ్రష్ చేస్తే చాలా మంచిది.. ముఖ్యంగా చాక్లెట్ డ్రింకులు ఇలాంటివి తీసుకుంటే వెంటనే మీరు నోరు శుభ్రం చేసుకోవాలి.. లేకపోతే మీ పళ్ల పై ఎనామిల్ దెబ్బతింటుంది.
 పళ్లు పుచ్చిపోయేందుకు కారణమవుతాయి. కాఫీ, టీ, శీతల పానీయాలు తీసుకుంటే పళ్లకి చాలా ఎఫెక్ట్ చూపిస్తాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here