శోభన్ బాబు అంత ఆస్తిపరుడు ఎలా అయ్యారు –  ఎక్కడ పెట్టుబడులు పెట్టారంటే

0
శోభన్ బాబు అంటే ముందు మనకు అనిపించేది సోగ్గాడు, ఇక సోగ్గాడు అంటే ముందు మనకు గుర్తు వచ్చేది శోభన్ బాబు, అంత అందగాడు ఆయన, అంతేకాదు ఆయన సినిమా వస్తోంది అంటే అభిమానులు టికెట్ల కోసం క్యూ కట్టేవారు, ఇక ఆయన సినిమా చూసేందుకు మహిళా ప్రేక్షకులు చాలా మంది వచ్చేవారు.. వారికోసం ప్రత్యేకంగా టికెట్ కౌంటర్లు కూడా పెట్టేవారు, అది ఆయన గొప్పతనం.
ఇక చాలా ఆర్దిక క్రమశిక్షణగా ఉండేవారు ఆయన… ఇక ఆయన గురించి ఎక్కడ ఎవరు మాట్లాడినా మన దేశంలో సినిమా నటుల్లో ధనవంతుడు అంటే ఆయనే అని అంటారు… అయితే ఆయన సినిమా పరిశ్రమలోకి వచ్చే సమయంలో పెద్దగా ఆస్తులు లేవు… అయితే ఆయన సినిమాలు చేస్తున్న వేళ ఆయనకు మంచి రెమ్యెనరేషన్ వచ్చేది… వీటితో ఎక్కువగా హైదరాబాద్ చెన్నైలోని పలు ఖాళీస్దలాలు పొలాలు ద్రాక్ష తోటలు కొనేవారట.
ఇక వాటిపై వచ్చే ఆదాయం రెంట్స్ ఇవన్నీ కలిపి ఏడాదికి మరో ప్రాపర్టీ కొనేవారు, ఇలా భూములు చాలా వరకూ వందల ఎకరాలు కొనేవారు, ఇక సినిమా పూర్తి అయ్యాక వచ్చిన రెమ్యునరేషన్ మొత్తంతో పెద్ద మొత్తంలో ఒకేచోట ల్యాండ్ కొనేవారు..
ఇవన్నీ దాదాపు వేల రూపాయల్లో కొన్నవి తర్వాత కోట్ల రూపాయలు అయ్యాయి… ఇలా ఆయన కోటీశ్వరుడు అయ్యారు.. ఇప్పటికీ ఆయనకు చెన్నైలో చాలా చోట్ల ఖరీదైన ప్రాంతాల్లో స్దలాలు భూములు ఉన్నాయి, వారి వారసులు వాటిని చూసుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here