ఊసరవెల్లి  రంగు ఎలా మారుస్తుంది – దాని వెనుక ఉన్న కారణం ఇదే

0
ఎవరైనా ఏదైనా మాట మారిస్తే మనం అనేమాట వెంటనే ఏమిటిరా ఊసరవెల్లిలా మాట మారుస్తున్నావు  అని అంటాం.. నిజానికి
వారి రూపం మాట అన్నీ మారుతూ ఉంటే మనం చేసే కామెంట్ ఇదే.. ఊసరవెల్లి దాని రంగును మళ్లీ మళ్లీ ఎందుకు మారుస్తుందనే డౌట్ మీకు ఎప్పుడైనా వచ్చిందా…వచ్చే ఉంటుంది దీని వెనుక ఎప్పుడైనా ఆలోచించారా సో ఇప్పుడు మనం అదే తెలుసుకుందాం.
ముఖ్యంగా ఇది ఇలా రంగు మార్చుకోవడానికి కారణం తనపై ఏదైనా జీవి అటాక్ చేయాలనుకుంటే దాని దృష్టి మారుస్తుంది, అంతేకాదు ఇలా వేటాడే సమయంలో కూడా దాని రంగుని మారుస్తుంది… దాని భద్రత దాని ఆహర వేట కోసం ఇలా చేస్తాయి అవి. ఊసరవెల్లి శరీరానికి ఫోటోనిక్ క్రిస్టల్ అని పిలువబడే పొర ఉంటుంది. దాని శరీరంలో ఇది ఉండటం వల్ల ఇది రంగు మారుస్తుంది.
అయితే ఈ పొర వల్ల అది ఏ చెట్టు మీద ఉన్నా గోడమీద ఉన్నా దాని రంగు మారేలా మెదడుకి సంకేతం ఇస్తుంది.
ఇలా ఫోటోనిక్ క్రిస్టల్ పొర కాంతి ప్రతిబింబాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది దాని శరీరం వేడి కాకుండా కాపాడుతుంది, మొత్తానికి
రంగు మార్చడానికి కారణం ఇది అని అంటున్నారు నిపుణులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here