హైదరాబాద్ మేయర్ రేసులో ఉన్న వారు వీరే – అందరివి పెద్ద కుటుంబాలే

హైదరాబాద్ మేయర్ రేసులో ఉన్న వారు వీరే - అందరివి పెద్ద కుటుంబాలే

0

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నిక హడావిడి మొదలైంది ..ఓ పక్క పార్టీలు ప్రచారం మొదలు పెట్టాయి, ఈసారి బల్దియాలో బస్తీమే సవాల్ అంటున్నాయి పార్టీలు, మరీ ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ పార్టీలో అప్పుడే మేయర్ పదవి గురించి చర్చ జరుగుతోంది, దీనికి కారణం పలు సర్వేలు కూడా టీఆర్ఎస్ విజయం సాధిస్తుంది అని చెబుతున్నాయి, మరి మేయర్ పీఠంపై ఎవరి ఫోకస్ ఎలా ఉంది అసలు ఎవరి పేర్లు వినిపిస్తున్నాయి అనేది చూద్దాం.

ఎక్స్-అఫిషియో సభ్యులు కీలక నిర్ణయాత్మకంగా జీహెచ్ఎంసీలో ఉన్నారు. అధికార టిఆర్ఎస్ అత్యధిక సంఖ్యలో ఎక్స్-అఫిషియోలను కలిగి ఉంది. ఇది కూడా ఓ కీలక పాయింట్.. ఇక చాలా మంది సీనియర్ నేతల కుమార్తెల కోడళ్ల పేర్లు వినిపిస్తున్నాయి గ్రేటర్ లో. ఓసారు వారు ఎవరు అనేది చూద్దాం.

దివంగత నేత మాజీ మంత్రి నాయిని నరసింహారెడ్డి కుమార్తె పేరు వినిపిస్తోంది.
మంత్రి తలాసాని శ్రీనివాస్ యాదవ్ కుమార్తె పేరు తెరపైకి వచ్చింది
పిజెఆర్ కుమార్తె పి విజయారెడ్డి
రాజ్యసభ ఎంపి కేశవ రావు కుమార్తె విజయ లక్ష్మీ
మంత్రి మల్లా రెడ్డి కుమార్తె పేరు వినిపిస్తోంది
డిప్యూటీ స్పీకర్ టి పద్మారావు కుమార్తెపేరు వినిపిస్తుంది,
ఇక ప్రస్తుత మేయర్ బొంతు రామ్మోహన్ భార్య పేరు వినిపిస్తున్న ఆయన ప్రస్తుతం మేయర్ గా చేశారు కాబట్టి అవకాశం ఉండకపోవచ్చు. మరి ఇంత మంది ఆశావహులు ఉన్నారు మరి ఎవరిని ఫైనల్ చేస్తారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here