నేను త్వరగా చనిపోవాలి..రామ్ గోపాల్ వర్మ షాకింగ్ ట్వీట్లు

0

తెలుగు రాష్ట్రాల ప్రజలకు టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన స్టైల్ లో సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా ముఖేష్ అంబానీ కంటే ఎక్కువ డబ్బులు సంపాదించాలని కోరుకుంటున్నట్లు ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు వర్మ.

“అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. భగవంతుడు మీలో ప్రతి ఒక్కరికి పెద్ద ఇల్లు మరియు ముకేష్ అంబానీ కంటే ఎక్కువ డబ్బుని ఇవ్వాలి. ప్రస్తుతం లేదా భవిష్యత్తులో మీకు ఎలాంటి వైరస్ సోకకుండా ఉండాలి. పురుషులందరూ ప్రపంచంలోనే అత్యంత అందమైన స్త్రీని పొందాలి. అందరు స్త్రీలు అత్యంత అందమైన వ్యక్తిని పొందాలని కోరుకుంటున్నాను” అంటూ ట్వీట్ చేశారు వర్మ.

” భర్తలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మరియు మీ భార్యలు మిమ్మల్ని ఎప్పటికీ బాధించకూడదని మరియు మీరు ఏమి చేసినా లేదా మీరు ఏమి చేయకపోయినా వారు ఓకే చేస్తారని దేవుడు మీ కోరికను ప్రసాదిస్తాడు” అంటూ మరో ట్వీట్ చేశారు వర్మ. ప్రస్తుతం వర్మ ట్వీట్ వైరల్ గా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here