ఐస్ క్రీమ్ షాపు తీసిన యజమానిని పోలీసులు ఏం చేశారంటే

ఐస్ క్రీమ్ షాపు తీసిన యజమానిని పోలీసులు ఏం చేశారంటే

0

ఈ లాక్ డౌన్ సమయంలో ఎవరూ షాపులు తీయద్దు అని పోలీసులు చెబుతూనే ఉన్నారు , కాని కొందరు సెలూన్లు పర్మిషన్ లేని షాపులు తీస్తూనే ఉన్నారు, ఇక తాజాగా ఐస్ క్రీమ్ షాపులు తీయద్దు అన్నారు, అయితే ఓ వ్యక్తి రెడ్ జోన్ ప్రాంతంలో వడోదరాలో ఐస్ క్రీమ్ షాపు తీశాడు, దాదాపు అతని షాపులో 20 వేల రూపాలయ ఐస్ క్రీమ్స్ ఉన్నాయట.

అవి మళ్లీ పోతాయి అని అమ్మడానికి తీశాడు, కాని పోలీసులు వచ్చే సరికి అమ్మడానికి తీయలేదు అని అన్నాడు, మరి దేనికి తీశావు షాపు అంటే, కేవలం పిల్లలకు ఉచితంగా ఇవ్వడానికి తీశాను అని తప్పించుకునేందుకు చెప్పాడు …వెంటనే పోలీసులు ఒకే ఎవరికి పంచుతావు అని అడిగారు.. దీంతో పేదలకు పంచుతా అన్నాడు.

వెంటనే ఓ అనాధ ఆశ్రమానికి పేదవారు ఉన్న ప్రాంతాలకు ఈ ఐస్ క్రీమ్ తీసుకువెళ్లి పంచేస్తాం అని చెప్పారట…దీంతో చేసేది లేక బాక్సులు అన్నీ వారికి ఇచ్చేశాడు, ఈ సమయంలో షాపు తీసి అమ్మడానికి ప్రయత్నించాడు.. పోలీసులు వచ్చే సరికి మాట మార్చాడు ..దీంతో పోలీసులు అతని తిక్క కుదిర్చారు..అవన్నీ రెండు గంట్లలో పేదలకు పిల్లలకు పంచారు పోలీసులు .