జపాన్ లో మీ వలలో ఆ చేప పడితే – ఇక మీరు తోపులు అంతే

0
మన ప్రపంచంలో ఎక్కడైనా సరే పెద్ద చేప పడితే ఇక వాడు లక్కీ పర్సెన్.. ఎక్కువ నగదు వస్తుంది అని చాలా మంది అంటారు.. ఇక వలలో పెద్ద చేపలు పడితే ఏకంగా లక్షలు సంపాదించిన వారు ఉన్నారు.. నిజమే పెద్ద చేపలకు అంత మార్కెట్ ఉంది…అయితే చిన్న చేపల గురించి ఇక్కడ ఓ విషయం చెప్పుకోవాలి.
జపాన్ లో మీరు వల వేసిన సమయంలో మీ వలలో మరీ చిన్న చేప పడిందనుకోండి మీరు చాలా లక్కీ.. అంతేకాదు మిమ్మల్ని ఎంతో పొగుడుతారు… మీరు మంచి స్కిల్ ఉన్న వారుగా కిర్తిస్తారు… ఎందుకు అంటే సూక్ష్మ కళలో జపాన్ ప్రజలు సుప్రసిద్ధులు
..  అంతేకాదు ఇటు గార్డెనింగ్ నుంచి అటు  ఆర్కిటెక్చర్ వరకూ అన్నింటా మంచి టాలెంట్ ఉన్నవారు, చిన్న చిన్న ఆర్ట్ లు చేయడంలో వరల్డ్ లో ది బెస్ట్ వారు.
అందుకే ఇక్కడ ఇలా పెద్ద చేపలు ఎవరైనా పడతారు …చిన్న చేపలు కదా పట్టాలి అని అంటారట..దీన్ని అక్కడ టనాగో ఫిషింగ్ అంటారు.. ఇది ఇప్పటి నుంచి కాదు వందల ఏళ్ల నుంచి వస్తుంది, దీని కోసం చాలా సన్నని వల తయారు చేస్తారు, ఇక చిన్న చేప పడితే అక్కడ వారికి సన్మానం కూడా చేస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here