దమ్ముంటే నా మీద కేసులు పెట్టండి..కిషన్ రెడ్డికి కేటీఆర్ సవాల్

0

దమ్ముంటే నా మీద కేసులు పెట‍్టండని తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి సవాల్ విసిరారు. దేశంలో అగ్నిపథ్‌ అనే పథకాన్ని తీసుకొచ్చి యువత కడుపు కొడుతున్నారని మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు. ఆవేదనతో వారు ఆందోళన చేస్తుంటే వారిపై దేశద్రోహం కేసులు పెడుతున్నారని ఆరోపించారు.

ఐడీపీఎల్‌ నుంచి రోడ్లు వేస్తుంటే కేసులు పెట్టమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్తున్నారంట. కిషన్ రెడ్డికి దమ్ముంటే మున్సిపల్ మంత్రినైన నా మీద కేసు పెట్టండి. చిన్నా చితక అధికారులను బెదిరించొద్దు. మీకు చేతనైతే రోడ్లు, ఫ్లై ఓవర్లు కట్టండి అంతే కాని అభివృద్ధి అడ్డుకోకండిని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని కేటీఆర్‌ కోరారు.

కిషన్ రెడ్డి మోదీ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా ఉండి అగ్నిపథ్‌లో చేరితే డ్రైవర్లు, బట్టలు ఉతికే స్కిల్స్ వస్తాయి అంటున్నారు. ఈ మాత్రం దానికి దేశ యువత మిలిటరీలో చేరాలా అంటూ కేటీఆర్‌ ప్రశ్నించారు. హైదరాబాద్‌లో నూతనంగా అందుబాటులోకి వచ్చిన కైతలాపూర్‌ ఫ్లై ఓవర్‌ను ప్రారంభించిన అనంతరం కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here