ప్లాస్టిక్ కవర్లు వాడడం వల్ల జరిగే నష్టాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

0

మార్కెట్ లో కూరగాయలు, పండ్లును ప్లాస్టిక్ కవర్లలో వేసి ఇంటికి తెచ్చుకొని వాటిని ఇతర పనులకు వాడుతుంటారు. కానీ ప్లాస్టిక్ వాడడం వల్ల అనేక రకాల సమస్యలు వస్తాయని తెలియక చాలామంది వాటిని విచ్చలవిడిగా ఉపయోగిస్తున్నారు. ప్లాస్టిక్  సహజసిద్ధమైన పదార్థం కాదు. కావున వీటివల్ల వాతావరణంలో తీవ్రంగా కాలుష్యం ఏర్పడే ప్రమాదం ఉంటుంది.

పాలిథిన్ కవర్లలో ఆహార పదార్థాలను తీసుకెళ్తే ప్రాణానికే ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే వాటిలోని రసాయనాలు ఆహారాన్ని కలుషితం చేసి వివిధ రకాల ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది. అంతేకాకుండా ఈ కవర్లను పొరపాటున జంతువులు మింగితే చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే కవర్లను వాడిన తరువాత పడేయడం చాలా ప్రమాదం.

ఒకవేళ ప్లాస్టిక్ కవర్లును పడేయకుండా కాల్చాలనుకున్న చాలా ప్రమాదాలు వస్తాయి. ఎందుకంటే పాలిథిన్ బ్యాగ్‌లను కాల్చుతున్నప్పుడు వీటినుండి వెలువడే డయాక్సిన్స్ అనే విషపదార్థాలు గాలిలో కలిసి ఆ గాలిని పీల్చినవారు అనేక రకాల క్యాన్సర్ల బారిన పడక తప్పదు. అందుకే కవర్లకు బదులుగా గుడ్డసంచి, జనపనార సంచులను వాడడం మంచిది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here