ఇలియానా సల్మాన్ ఖాన్ దగ్గర చేసిన రెండు తప్పులు ఇవే

ఇలియానా సల్మాన్ ఖాన్ దగ్గర చేసిన రెండు తప్పులు ఇవే

0

గోవా బ్యూటీ ఇలియానా టాలీవుడ్ కోలీవుడ్ బాలీవుడ్ లో హీట్ పుట్టిస్తోంది.. పలు సినిమాలను ఒకే చేస్తోంది ఈ అందాల భామ.. ఇక గతంలో ఆమె కాల్షీట్ల కోసం దర్శక నిర్మాతలు క్యూ కట్టేవారు.. తర్వాత ఆమె సినిమాల జోరు తగ్గింది.. కాని మళ్లీ గోవా బ్యూటీ స్పీడు పెంచింది. అయితే తాజాగా ఇలియానా ఓ విషయాన్ని తెలియచేసింది. గతంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పిలిచి మరీ అవకాశాలు ఇచ్చినా, తాను కాదన్నానని ఆమె తెలిపింది.

ఇదేమిటి సల్మాన్ లాంటి వ్యక్తి అవకాశం ఇస్తే ఎందుకు ఇలియానా వద్దు అంది అని అందరూ చర్చించుకుంటున్నారు, అయితే దీనికి కారణం కూడా ఉందట..సల్మాన్ వాంటెడ్ సినిమా సమయంలో తాను ఎగ్జామ్స్ రాస్తున్నానని చెప్పింది. సల్మాన్ మరో సినిమా కిక్ సమయంలో మరో సినిమాకు కమిట్ మెంట్ ఉండటంతో ఆ చిత్రాన్ని చేయలేకపోయానని తెలిపింది.
లేకపోతే సల్మాన్ తో ఈ రెండు సినిమాలు చేసే అవకాశం తనకే ముందు వచ్చింది అని చెప్పింది ఇల్లిబ్యూటీ.

వాంటెడ్ సినిమా పోకిరి సినిమాకి రీమేక్ గా తీశారు… కిక్ సినిమా తెలుగు కిక్ కు రీమేక్ గా తీశారు, అయితే ఇక్కడ రెండు సినిమాల్లో ఆమె నటించింది, పాపం నిజంగా ఆ సమయంలో తనకి కుదురి ఉంటే ఆమె నటించేది. దీంతో అక్కడ నిర్మాతలు సల్మాన్ వేరే వారిని ఫిక్స్ చేసుకున్నారు.