చరిత్ర సృష్టించిన భారత్..టీకా పంపిణీ @100 కోట్లు

0

వ్యాక్సినేషన్​ ప్రక్రియలో భారత్​ చరిత్ర సృష్టించింది. టీకా పంపిణీలో 100 కోట్ల మార్కును అందుకుంది. జనవరి 16న ప్రారంభమైన వ్యాక్సిన్ల పంపిణీ.. శరవేగంతో అక్టోబర్​ 21 నాటికి 100 కోట్లకు చేరింది. తాజా రికార్డుపై నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మూడో దశ కరోనా విజృంభించే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో ఇది ఊరటనిచ్చే విషయం అంటున్నారు.

దేశవ్యాప్తంగా జనవరి 16న టీకా పంపిణీ కార్యక్రమం మొదలైంది. 10 కోట్ల మార్కును అందుకునేందుకు 85 రోజులు పట్టింది. 20 కోట్ల మార్కును 45 రోజుల్లో, 30 కోట్ల మార్కును 29 రోజుల్లో దాటేసింది. ఆ తర్వాత టీకా పంపిణీలో భారత్​ దూసుకుపోయింది. 24 రోజుల తర్వాత 40 కోట్ల డోసులు, 20 రోజుల అనంతరం ఆగస్టు 6న 50 కోట్ల మైలురాయిని చేరుకుంది. ఆ తర్వాత కేవలం 76 రోజుల్లోనే 100 కోట్ల మార్కును అందుకుంది. దేశంలోని 75 శాతం మంది కనీసం ఒక్క డోసు తీసుకున్నారు. 31 శాతం మంది రెండు డోసులు తీసుకున్నట్టు అధికార వర్గాల సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here