ఇండియన్ 2 సినిమాలో కాజల్ పాత్ర తెలిస్తే షాక్

ఇండియన్ 2 సినిమాలో కాజల్ పాత్ర తెలిస్తే షాక్

0

ఇండియన్ 2 చిత్రంలో నటి కాజల్ అగర్వాల్ నటిస్తోంది అనే విషయం తెలిసిందే, తాజాగా ఆమె ఇందులో ఏ పాత్ర చేస్తున్నారు అనేది బయట పెట్టేశారు. దర్శకుడు శంకర్ ఈ సినిమాకి సంబంధించి ఏ విషయం బయట పెట్టకూడదు అని కండిషన్ పెట్టారట..ఇండియన్–2 చిత్రంలో కమలహాసన్తో తొలిసారిగా జత కడుతోంది.

తాజాగా వారం క్రితం ఆ చిత్ర షూటింగ్లో పాల్గొన్నారు కాజల్ . ఇండియన్–2 చిత్రంలో తన పాత్ర 85 ఏళ్ల బామ్మదని చెబుతోంది, అయితే సినిమాలో కమల్ తర్వాత ఆమెదే కీలకమైన పాత్ర అని చెబుతోంది ఆమె…ఈ పాత్రకు మేకప్ కోసమే అనేక గంటలు పడుతోందట.మళ్లీ తనకు చిత్ర షూటింగ్ తదుపరి షెడ్యూల్ పిబ్రవరిలో మొదలవుతుందని చెబుతోంది.

మలయాళ యువ నటుడు దుల్కర్ సల్మాన్తో జత కట్టడానికి సిద్ధమవుతోందని టాక్. తమిళం, మలయాళం భాషల్లో ఈ చిత్రం తెరకెక్కనుందని తెలిసింది. అయితే కమల్ తో సినిమా చేయాలని ఆమె కోరిక, తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత ఆమె దుల్కర్ సల్మాన్ తో నటిస్తారు అని తెలుస్తోంది.