ఇంటికి వెళ్లని రాహుల్ ఎక్కడున్నాడో తెలిస్తే మతిపోతుంది

ఇంటికి వెళ్లని రాహుల్ ఎక్కడున్నాడో తెలిస్తే మతిపోతుంది

0

బిగ్ బాస్ 3 టైటిల్ విన్నర్ రాహుల్ కు మంచి పేరు వచ్చింది .. తన గాత్రంతో అద్బుతమైన పాటలు పాడి యువత ప్రేమను అభిమానాన్ని సంపాదించాడు రాహుల్.. అవే తన విజయానికి ఓట్ల రూపంలో వచ్చాయి అని చెప్పాలి. రాహుల్ పాడిన పాటలకు ఫిదాకాని వారు లేరు అనే చెప్పాలి. అందరికంటే ఎక్కువ సార్లు నామినేట్ అయి, ఎలిమినేషన్ కు వెళ్లినా సేఫ్ అయి హౌస్ లోకి వచ్చేవాడు రాహుల్.

అయితే బిగ్ బాస్ 3 లో విజేతగా నిలిచిన రాహుల్ కు ఘన స్వాగతం లభించింది.. అన్నపూర్ణ స్డూడియోలో తన షూటింగ్ పూర్తి చేసుకుని బిగ్ బాస్ గుర్తులు చూసుకుని బయటకు వచ్చారు రాహుల్ .. అతని మిత్రులు ఘనస్వాగతం పలికారు. విజయనగర్ కాలనీలోని ఆయన ఇంటి వద్దకు భారీ సంఖ్యలో అభిమానులు చేరుకొని అభినందనలు తెలిపారు. దీంతో పోలీసులకు అతి పెద్ద సవాల్ గా ఇది మారింది. దారిపొడుగునా రాహుల్ కు అభిమానులు పెద్ద సంఖ్యలో చేరారు.

అయితే ఇంటికి మాత్రం రాలేదట. ఇంటి దగ్గర వేలాది మంది అభిమానులు ఉండటంతో అక్కడ నుంచి ఆయన సన్నిహితుడి ఇంటికి వెళ్లారట అక్కడ కు కూడా చాలా మంది అభిమానులు రావడంతో. బంధువుల ఇంటికి వెళ్లారు అని తెలుస్తోంది, రాహుల్ రెండు రోజులు అయినా ఇంకా ఆయన ఇంటికి రాలేదు అని సన్నిహితులు చెబుతున్నారు. మొత్తానికి రాహుల్ కు మంచి క్రేజ్ వచ్చింది అనే చెప్పాలి