ఇంటికి వెళ్లాల‌ని పోలీసుల ద‌గ్గ‌ర ప‌ర్మిష‌న్ చివ‌ర‌కు మోసం బ‌య‌ట‌ప‌డింది

ఇంటికి వెళ్లాల‌ని పోలీసుల ద‌గ్గ‌ర ప‌ర్మిష‌న్ చివ‌ర‌కు మోసం బ‌య‌ట‌ప‌డింది

0

ఈ క‌రోనా స‌మ‌యంలో ఎక్క‌డ వాళ్లు అక్క‌డే ఉండిపోయారు, చంద్ర అనే వ్య‌క్తి బ్యాంకు ఉద్యోగి.. అయితే భార్యని చూసేందుకు అత్తగారి ఇంటికి వెళ్లాడు, ఈ స‌మ‌యంలో అత‌ను అక్క‌డే లాక్ డౌన్ కార‌ణంగా చిక్కుకున్నాడు, అయితే గ‌త 20 రోజులుగా అక్క‌డే ఉన్నాడు, ఇక వెళ్ల‌డానికి ర‌వాణా సౌక‌ర్యాలు లేవు.

ఇక ప‌ర్మిష‌న్ లెట‌ర్ తీసుకుని వెళితే స్టేట్ దాట‌చ్చుక‌దా అని భావించాడు, ముందు ప‌ర్మిష‌న్ అడిగాడు పోలీసులు ఇవ్వ‌లేదు.. 700 కిలోమీట‌ర్లు ప‌ర్మిష‌న్ ఇవ్వం అన్నారు, పైగా బైక్ పై వెళ‌తా అన్నాడు, అయినా ఇవ్వ‌లేదు, ఇక మ‌రో నాలుగు రోజుల‌కి వ‌చ్చి మా నాన్న‌గారికి సీర‌య‌స్ నేను వెళ్లాలి అని అబ‌ద్దం చెప్పాడు.

ఆఫీస‌ర్ వచ్చాక లెట‌ర్ ఇస్తారు అని అత‌నికి సిబ్బంది చెప్పారు, వెంట‌నే ఆఫీస‌ర్ వ‌చ్చిన త‌ర్వాత తండ్రికి బాగోలేదు అని చెప్పాడు..దీంతో మీ బ్ర‌ద‌ర్స్ సిస్ట‌ర్ నెంబ‌ర్ ఉంటే ఇవ్వ‌మ‌ని పోలీస్ అడిగారు, వెంట‌నే త‌డ‌బాటుతో ఇచ్చాడు, వారికి ఫోన్ చేసి మీ ఫాద‌ర్ కు బాగాలేదా అని అడిగారు, అక్క‌డ రిప్లై మాత్రం ఆయ‌న క్షేమంగా ఉన్నారు అని వ‌చ్చింది, ఇక ఇక్క‌డ ఈ వ్య‌క్తిపై పోలీసుల‌ని మోసం చేసాడు అనే అభియోగంతో కేసు నమోదు అయింది.