ఐపీఎల్ – గ్లెన్ మ్యాక్స్వెల్ – కాట్రెల్ కి షాకివ్వనున్న పంజాబ్ ?

ఐపీఎల్ - గ్లెన్ మ్యాక్స్వెల్ - కాట్రెల్ కి షాకివ్వనున్న పంజాబ్ ?

0

ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ కప్ ని కైవసం చేసుకుంది ముంబై ఇండియన్స్, అయితే ఈ గెలుపుతో మంచి జోష్ మీద ఉన్నారు, వచ్చే టీమ్ లో కూడా ఎలాంటి మార్పు ఉండదు అనే తెలుస్తోంది, అయితే పంజాబ్ టీమ్ కీలక ఆలోచన చేస్తోందట.
ఈ సారి లీగ్ లో దారుణంగా విఫలమైన ఆస్ట్రేలియా ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్, వెస్టిండీస్ బౌలర్ షెల్డన్ కాట్రెల్లకి గుడ్ బై చెబుతుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.

హిట్టర్ గా పేరు ఉన్న ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ ఈ సారి ఎలాంటి ప్రతిభావంతమైన ఆటతీరు కనబరచలేదు, ఇక మరో ఆరునెలల్లో నెక్ట్స్ సీజన్ స్టార్ట్ అవుతుంది, అందుకే ఇప్పటి నుంచే పంజాబ్ టీమ్ సిద్దం అవుతోంది మార్పులకి..
కెప్టెన్గా కేఎల్ రాహుల్, హెడ్ కోచ్గా అనిల్ కుంబ్లేను కొనసాగించేందుకు సిద్ధమైంది. ఇక ఈ ఏడాది లీగ్ లో రాహుల్
అదరగొట్టాడు.

మొత్తం 14 మ్యాచ్ల్లో 55.83 సగటుతో 670 పరుగులు చేసి టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడికి ఇచ్చే ఆరెంజ్ క్యాప్ను గెల్చుకున్నాడు. పంజాబ్ కోచ్గా తనకు తొలి ఏడాదే అయినా చాలా వరకూ గెలుపు తీరాలకు తీసుకువచ్చాడు కుంబ్లే, ఆయనకు ఛాన్స్ అలాగే ఉంటుంది.

మ్యాక్స్వెల్ రూ.10.75 కోట్లు…కాట్రెల్ రూ.8.5 కోట్లు ఇచ్చి తీసుకున్నారు, కాని వీరు పెద్ద ఆడింది లేదు మొత్తం 13 ఇన్నింగ్స్ లో 108 పరుగులు చేశాడు మ్యాక్స్ వెల్ మయాంక్ అగర్వాల్, నికోలస్ పూరన్, షమీ, గేల్, యువ లెగ్స్పిన్నర్ రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్లను కొనసాగించే వీలుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here