టీడీపీని మరో ఇరకాటంలో పెట్టిన వంశీ

(టీడీపీని మరో ఇరకాటంలో పెట్టిన వంశీ )

0

ఇప్పుడు వల్లభనేని వంశీ టెక్నికల్ గా ఏ పార్టీలో ఉన్నారు అంటే, ఆయన టీడీపీలో లేరు అని అంటారు.. ఎందుకు అంటే ఆయనని పార్టీ సస్పెండ్ చేసింది, అయితే ఆ పార్టీ ఇచ్చిన బీఫామ్ తో ఆయన ఎమ్మెల్యే అయ్యారు ఆ పదవి ఆయన వెంట ఉంది.

ఇంకా రాజీనామా చేయలేదు, మరి దీనిపై స్పీకర్ కు ఫిర్యాదు చేయలేదు, అందుకే ఆయన స్వతంత్ర ఎమ్మెల్యేగా ఉంటారు. అయితే ఆయనపై అనర్హత వేటు వేస్తారా లేదా అనేది చూడాలి. అయితే జగన్ కూడా అసెంబ్లీ సమావేశాల వరకూ వేచి చూద్దాం అని చూస్తున్నారు, గన్నవరంలో డవలప్ మెంట్ నేను చూసుకుంటా అనే హమీ అయితే వల్లభనేనికి ఇచ్చారు సీఎం జగన్.

ఇలాంటి నేపథ్యంలో రాజీనామా చేయకుండా, వైకాపాలో చేరకుండా.. తెదేపా పార్టీకి మాత్రం రాజీనామా చేస్తే.. వారు స్వతంత్ర సభ్యులుగా అయ్యే అవకాశం ఉంటుంది. మరి దీనికి స్పీకర్ ఒకే అంటారా లేదా చూడాలి. అయితే వంశీ ఈ అసెంబ్లీ సమావేశాల తర్వాత ఏమైనా స్టెప్ వేస్తారు అని అంటున్నారు ఆయన అభిమానులు.