శంకర్ సినిమాలో రామ్ చరణ్ రోల్ ఇదేనా ? టాలీవుడ్ టాక్ ?

0
మెగా పవర్స్టార్ రామ్చరణ్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమా చేస్తున్నారు…అలాగే ఆచార్య సినిమా చేస్తున్నారు.. ఇక ఈ ఏడాది ఈ రెండు సినిమాలు విడుదల అవుతాయి… అయితే నెక్ట్స్ చేయబోయే సినిమా కూడా అనౌన్స్ చేశారు చరణ్… ఆయన ప్రముఖ దర్శకుడు శంకర్ తో ఓ సినిమా చేయనున్నారు.. ఇది పాన్ ఇండియా చిత్రం, నిర్మాత దిల్ రాజు ఈ సినిమా నిర్మిస్తారు.
 శంకర్ తెరకెక్కించబోతున్న సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక ఇందులో బాలీవుడ్ భామ నటిస్తుంది అని వార్తలు వినిపిస్తున్నాయి….ఇప్పటికే కియరా పేరు వినిపిస్తోంది, అయితే తాజాగా ఇప్పుడు మరో వార్త వినిపిస్తోంది.
చరణ్తో పొలిటికల్ స్టోరీ సామాజిక అంశాలపై పోరాటం చేసే దిశగా సినిమా తీస్తున్నారు అని టాలీవుడ్ టాక్ నడుస్తోంది..
 ఇందులో ఆయన మెడికల్ స్టూడెంట్ అలాగే పొలిటిషియన్ గా సీఎం పాత్రలో కనిపిస్తారు అని వార్తలు వినిపిస్తున్నాయి, మరి  రోల్ ఏదైనా సరే చరణ్ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here