ఇష్టం లేని పెళ్లి చేసిన తండ్రికి కూతురు కన్నీటి లేఖ

ఇష్టం లేని పెళ్లి చేసిన తండ్రికి కూతురు కన్నీటి లేఖ

0

ఒకరిని ఒకరు ఎంతో ఇష్టంగా ప్రేమించుకున్నారు.. కాని వారి ప్రేమకు తండ్రి అడ్డు చెప్పడం, ఆ కులం వారితో
సంబంధం ఒప్పుకోను అని చెప్పడంతో తండ్రి మాట కాదు అని చెప్పలేకపోయింది కూతరు.. చివరకు తండ్రి చెప్పిన సంబంధం చేసుకుంది.. కాని పెళ్లి చేసుకున్న పది రోజులకి ఆమె తన తనవు చాలించింది, కారణం ఇదే.

అయితే చివరగా తన తండ్రికి లేఖ రాసింది చనిపోయే ముందు.. నా ప్రేమని నువ్వు అర్దం చేసుకోలేదు నాకు ఇష్టం లేకుండా వేరే వ్యక్తిని ఇచ్చి పెళ్లి చేశావు… నా వయసు 20 అతని వయసు 35 సంవత్సరాలు.. అభిప్రాయాలు ఇద్దరివి కలవలేదు… ఇలాంటి వ్యక్తితో నేను కాపురం చేయలేను…

ఒకవేళ నేను చేయను అని ఇంటికి వచ్చినా నా గత ప్రేమని మరచిపోలేక ఈ పనిచేశావు అంటావు, నేను ప్రేమించిన వ్యక్తినాకు లేడు, నువ్వు నన్ను కూతురిగా అర్దం చేసుకోలేదు.. ఇక నా ప్రియుడు నాకుదూరం అయ్యాడు.. ఇతనితో కాపురం చేయలేక నేనే ఇలా మరణిస్తున్నా అని కన్నకూతరు బాధతో లేఖరాసి ఆత్మహత్య చేసుకుంది.