జబర్దస్త్ నిహాంత్, నరేష్, నెమలి రాజు, దీవెన రెమ్యునరేషన్ తెలుసా

జబర్దస్త్ నిహాంత్, నరేష్, నెమలి రాజు, దీవెన రెమ్యునరేషన్ తెలుసా

0

జబర్దస్త్ ఈ షో అంటే చాలా మందికి ప్రత్యేమైన ఇష్టం ఉంటుంది…ఈ షో ద్వారా చాలా మంది కమెడియన్స్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఇప్పటికీ స్కిట్లు చేసి తమ ప్రతిభని ఇక్కడ నుంచి చూపించుకుని సినిమాల్లో అవకాశాలు పొందుతున్నారు. ఇలాగే హైపర్ ఆది సుడిగాలి సుధీర్ చమ్మక్ చంద్ర చాలా మంది సినిమాల్లోకి వచ్చారు, అవకాశాలతో పాటు డబ్బులు మంచి క్రేజ్ సంపాదించుకున్నారు.

ఇక టీఆర్పీ చూసుకున్నా అంతకంతకూ పెరుగుతూనే ఉంటోంది. ఈ షో ద్వారా చిన్నపిల్లలు యోధ, నిహాంత్, దీవెన, నరేష్ వంటి బుడతలు బాగా పాపులర్ అయ్యారు. వీరికి బయట ఫ్రోగ్రాములు కూడా బాగానే వస్తున్నాయి. స్కూల్ ఫంక్షన్లకి కూడా వీరిని పిలుస్తున్నారు అంటే వీరు ఎంత క్రేజీ స్టార్స్ అయ్యారో చెప్పవచ్చు.

నిహాంత్ తన మాటలు, హావభాబాలతో నవ్విస్తాడు. యోధ పంచ్లతో సందడి చేస్తే.. ఇక దీవెన ఏకంగా యాంకర్ రష్మీపైనే సెటైర్లు వేస్తోంది. రాకింగ్ రాకేష్ టీంలో వీరందరు ఉన్నారు. అయితే పిల్లలతో స్కిట్లు చేస్తూ సందడి చేస్తాడు రాకేష్.. స్కిట్లతో నవ్వులు పూయిచడంలో మంచి పేరు సంపాదించారు.మరి నిహాంత్, నరేష్, నెమలి రాజు, దీవెన వీరికి ఎంత రెమ్యునరేషన్ వస్తుందో తెలుసా.వీరికి రాకేష్ దాదాపు ఒక ఎపిసోడ్ కు ఒక్కొక్కరికి పదివేల చొప్పున ఇస్తున్నాడని తెలుస్తోంది. నరేష్ కి మాత్రం అందరికంటే కాస్త ఎక్కువ రెమ్యునరేష్ ఇస్తారట