జబర్ధస్త్ కు ఒకే చెప్పి న శ్రీముఖి ఎప్పటి నుంచో తెలుసా

జబర్ధస్త్ కు ఒకే చెప్పి న శ్రీముఖి ఎప్పటి నుంచో తెలుసా

0

జబర్దస్త్ కామెడీ షో పై గడిచిన 10 రోజులుగా అనేక వార్తలు వినిపిస్తున్నాయి, ఇక కొన్నిషోల తర్వాత నాగబాబు ఇక కనిపించరు అన్నారు.. అలాగే జరిగింది నాగబాబు జడ్జీగా గుడ్ బై చెప్పారు.. ఇక జీ తెలుగులో స్టార్ట్ అవ్వబోతున్న కొత్త షోలో నాగబాబు కనిపించనున్నారు.. అంతేకాదు యాంకర్ అనసూయ కూడా ఈ షోకు గుడ్ బై చెప్పారు.. ఇప్పుడు యాంకర్ గా రష్మి మాత్రమే కొనసాగుతోంది.

ఇక లీడ్ యాక్టర్స్ అందరూ వెళ్లిపోవడంతో జబర్దస్త్ కామెడీ షో ఎలా ఉంటుంది అని అనుమానం అందరికి కలిగింది.. అయితే నవ్వుల నవాబు నాగబాబు లేకపోతే షో ఎలా సాగుతుంది ఆయన ప్లేస్ లోకి ఎవరు వస్తారు అనేది మరో 10 రోజుల్లో క్లారిటీ రానుంది.

అయితే హాట్ యాంకర్ అనసూయ కూడా జబర్దస్త్ నుంచి వెళ్లిపోవడంతో ఆమె అభిమానులు షాక్ అయ్యారు.యాంకర్ అనసూయ భదర్వాజ్ సినిమాలు అలాగే కొత్త షోలతో బిజీగా ఉన్నారు. సో ఆమె కూడా గుడ్ బై చెప్పారు, అయితే మల్లెమాల మాత్రం అనసూయ స్థానంలో మరో కత్తి లాంటి యాంకర్ను తీసుకొస్తున్నారు. ఆమె మరెవరో కాదు శ్రీముఖి.తాజాగా ఆమెకు మంచి ఫేమ్ కూడా వచ్చింది ఆమె చేత జబర్ధస్త్ కు యాంకరింగ్ చేయించాలి అని చూస్తున్నారు శ్రీముఖి కూడా ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. డిసెంబర్ నుంచి ఆమె షూట్ కు రానున్నారట.