జబర్దస్త్ షోలో అత్యధిక రెమ్యునరేషన్ ఎవరికో చెప్పిన చమ్మక్ చంద్ర

జబర్దస్త్ షోలో అత్యధిక రెమ్యునరేషన్ ఎవరికో చెప్పిన చమ్మక్ చంద్ర

0

సినిమాల్లో సీరియల్లో నటుల పారితోషికం విషయాలు వివరాలు అంత త్వరగా బయటకు రావు. అయితే బుల్లితెరలో జబర్దస్త్ లో నటించే కమెడియన్లు ఆర్టిస్టుల గురించి వారి రెమ్యునరేషన్ గురించి కూడా ఎప్పుడూ వార్తలు వినిపిస్తూనే ఉంటాయి.. ఒక్కొక్కరికి షోకి లక్ష రూపాయల నుంచి మూడు లక్షల రూపాయలు అని వార్తలు వినిపిస్తాయి, అయితే ఏ నటుడు ఆర్టిస్టు దీనిపై ఎప్పుడూ క్లారిటీ ఇవ్వలేదు.

తాజాగా ఈ స్కిట్లు చేసే టీమ్ లీడర్లలో ఎవరికి అత్యధిక రెమ్యునరేషన్ వస్తుందో మాత్రం తెలిసిపోయింది. చమ్మక్ చంద్రకి అత్యధిక రెమ్యునరేషన్ వస్తోందట. ఈ కామెడీ షో ద్వారా చమ్మక్ చంద్ర క్రేజ్ పెరిగిపోయింది. ఈ షోను ఫాలో అయ్యేవారు, ఆయన స్కిట్ ఎప్పుడు వస్తుందా అని ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తారు. తాజాగా ఇంటర్వ్యూలో పలు విషయాలు చెప్పారు ఆయన సినిమా అవకాశాలు వస్తున్నప్పటికీ, ఏ సినిమాకి ఎన్ని రోజుల వర్క్ ఉంటుందో చెప్పలేము. అలాగే ఏ సినిమాకి ఎంత ఇస్తారో కూడా చెప్పలేము.

అదే జబర్దస్త్ షో నుంచి అయితే ప్రతి నెలా మాకు ఒక ఫిక్స్డ్ అమౌంట్ వస్తుంది .. అదే మా ధైర్యం. జబర్దస్త్ లో వున్న అన్ని టీమ్స్ కంటే నా టీమ్ కే పారితోషికం ఎక్కువ. అంటే నేను తీసుకునే పారితోషికమే ఎక్కువ. నా టీమ్ లో సభ్యులు ఎక్కువ మంది ఉంటారు వారి పాత్ర యాక్టింగ్ బట్టీ వారికి పారితోషికం ఇస్తాను అని చంద్ర తెలిపాడు.