జగన్ దృష్టికి రెండు కష్టమైన ప్రపోజల్…

జగన్ దృష్టికి రెండు కష్టమైన ప్రపోజల్...

0

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు భార్య లక్ష్మీపార్వతి ఎన్నికల సమయంలో తన వాయిస్ ను గట్టిగా వినిపించారు…. గతంలో అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడును టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేశారు…

అయితే వైసీపీ కోసం ఇంతలా చేసిన ఆమెకు ఈ ఎన్నికల్లో జగన్ ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ఎమ్మెల్సీనో రాజ్యసభనో ఇస్తారని ఆమె అనుచరులు భావించారు… అయితే ఇంతవరకు అది జరుగలేదు… వైసీపీ అధికారంలోకి వచ్చి ఆరు ఏడు నెలలు పూర్తి కావస్తుంది అయినా కూడా ఆమెకు ఎటువంటి గుర్తింపులేదు.

కనీసం నామినేటెడ్ పోస్ట్ అయినా ఇస్తారని భావిస్తున్నారు… తాజాగా ఆర్టీసీ చైర్మన్ గా ఉన్న టీడీపీ నేత వర్ల రామయ్య రాజీనామా చేశారు… ఆ పదవి లక్ష్మీ పార్వతికి వరిస్తుందని అభిమానులు భావిస్తున్నారు… అయితే ఈ పోస్ట్ కు కూడా చాలామంది సీనియర్లు రేసులో ఉన్నారు…

దీంతో లక్ష్మీపార్వతి అభిమానులు టెన్షన్ కు చెందుతున్నారట…ఈ ఎన్నికల్లో కోడెలను ఓడించి పార్టీకి బలమైన గొంతుగా పని చేసిన తనకు మంత్రి పదవి ఇవ్వలేదని ఇప్పటికే అంబటి రాంబాబు చాలా అసంతృప్తితో ఉన్నారు…. అందుకే ఆర్టీసీ చైర్మెన్ పదవిని ఆయన గట్టిగా పట్టుబడే అవకాశం ఉందని అంటున్నారు రాజకీయ మేధావులు…