జగన్ ఎందుకు భయపడుతున్నారు… రీజన్ అదేనాట

జగన్ ఎందుకు భయపడుతున్నారు... రీజన్ అదేనాట

0

జాతీయ మహిళా కమిషన్ సభ్యులు పర్యటనకి వస్తే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎందుకు భయపడుతున్నారని టీడీపీ నేత ఎమ్మెల్సీ నారాలోకేశ్ ఆరోపించారు… మహిళలు నోరు విప్పితే వైసీపీ ప్రభుత్వం చేసిన నీచమైన పనులు ప్రపంచానికి తెలుస్తాయని భయమా అని ప్రశ్నించారు…

144 సెక్షన్ పెట్టి మహిళల్ని ఇళ్లలో బందిస్తారా అంటూ లోకేశ్ రెచ్చిపోయారు… పోలీసుల ముసుగులో మహిళల పై జరిగిన దాడిని దాచేస్తే దాగదని అన్నారు…

పోలీసు బూటు కాలుతో తన్నించారని, విడిచి పెట్టడానికి కులం అడిగారని ఆరోపించారు. మహిళల పై పోలీసుల ముసుగులో జరిగిన అరాచకాలు అన్ని కమిషన్ దృష్టికి తీసుకువెళతామని అన్నారు. మహిళల పట్ల ఇంత దారుణంగా, అసభ్యంగా వ్యవహరించింది ముఖ్యమంత్రి జగన్ ఒక్కరే అని ఆరోపించారు లోకేశ్