వైసీపీలో మాజీ ఎమ్మెల్యే ఎంట్రీకి జగన్ బ్రేకులు

వైసీపీలో మాజీ ఎమ్మెల్యే ఎంట్రీకి జగన్ బ్రేకులు

0

తెలుగుదేశం పార్టీకి చెందిన మరో మాజీ ఎమ్మెల్యే వైసీపీ వైపు చూస్తున్నారట.. అంతేకాదు ఆయన గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి అని తెలుస్తోంది.. గతంలో జగన్ పై తీవ్రస్ధాయిలో విమర్శలు చేశాడు.ఇసుక మైనింగ్ పై కేసులు ఉన్నాయట, అయితే ఇప్పుడు నెక్ట్స్ టార్గెట్ నేనే అవుతా అనే భయంలో సదరు ఎమ్మెల్యే ఉన్నాడని వార్తలు వస్తున్నాయి, అందుకే వైసీపీ నేతలతో టచ్ లోకి వెళ్లాడు అని వార్తలు వస్తున్నాయి.

అయితే ఆ మాజీని పార్టీలో చేర్చుకుంటే కేసుల కోసమే జగన్ పార్టీలో చేర్చుకున్నారు అనే విమర్శలు వస్తాయి ..టీడీపీ కూడా అదే అంటుంది. అందుకే అతనిని వైసీపీలో గేట్లు మూసేస్తున్నారట, ముఖ్యంగా మైనింగ్ లో అతనిదే హవా నడిచింది… బాబు కూడా అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో అడ్డు అదుపు లేకుండా పోయింది అనే విమర్శలు వస్తున్నాయి, జిల్లా వైసీపీ నేతలు కూడా దీనిలో తాము ఏమీ చేయలేము అని ఫైనల్ గా చెప్పేశారట.