గంటాకు జగన్ ఆఫర్ అదిరింది…

గంటాకు జగన్ ఆఫర్ అదిరింది...

0

ఉత్తరాంధ్రలో టీడీపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజకీయంగా మంచి గట్స్ ఉన్న నేత అని అంటారు.. ఎన్ని పార్టీలు మారినా సరే పోటీ చేస్తే ఖఛ్చింగా విజయం సాధిస్తారు.. తాజాగా ఈ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా జగన్ సునామి ఏరులై పారినప్పటికి గంటా పోటీ చేసిన చోట మాత్రం జగన్ సునామి ప్రవహించలేక పోయింది…

ఈ ఎన్నికల్లో కొన్ని రాజకీయ కారణాలవల్ల గంటాను భీమిలీ నుంచి విశాఖ ఉత్తరంకు చంద్రబాబు నాయుడు షిఫ్ట్ చేయడంతో అందరు గంటా ఓటమి చెందుతారని భావించారు…చివరకు చివరకు టీడీపీ నాయకులు సైతం అదే అంచనాకు వచ్చారు. కానీ స్వల్పమెజార్టీతో గెలిచిరు. ఆయన రాజకీయ ఎంట్రీ అలాంటిది మరి.

తన రెండు దశాబ్దాల రాజకీయ చరిత్రలో ఇంతవరకు గంటా ఓటమి చెందలేదు. అలాంటి బలమైన నేతను జగన్ పార్టీలో చేర్చుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలు వస్తున్నాయి. గంటా లాంటి బలమైన నేతను వైసీపీలో చేర్చుకుంటే విశాఖలో టీడీపీని ఈజీగా దెబ్బకొట్టొచ్చు అనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది…

ఇక జగన్ శరుతుకు గంటా ఓకే అనేశారట. పార్టీలో చేరాలంటే ఎవరైనా సరే రాజీనామా చేయాలి అందుకే ఆయన రాజీనామా చేసేందుకు సిద్దంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. పార్టీలో చేరిన తర్వాత గంటాకు రాజ్యసభ సీటు ఇస్తారని వార్తలు వస్తున్నాయి