జగన్ ఎఫెక్ట్… అమరావతిలో తనకు ఎంత భూమి ఉందో నిజం ఒప్పుకున్న చంద్రబాబు…

జగన్ ఎఫెక్ట్... అమరావతిలో తనకు ఎంత భూమి ఉందో నిజం ఒప్పుకున్న చంద్రబాబు...

0

మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు… వైసీపీ అధికారంలోకి వచ్చి సుమారు ఎనిమిది నెలలు అయిందని గత టీడీపీ హయాంలో అవినీతి జరిగితే ఎందుకు నిరూపించలేకపోయిందని ఆరోపించారు…

తాజాగా జాతీయ మీడియాతో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ… వైసీపీ నేతలు కొద్దికాలంగా ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపిస్తున్నారని కానీ ఇంతవరకు నిరూపించలేదని మండిపడ్డారు… ఇన్ సైడర్ ట్రేడింగ్ లో భాగంగా పదే పదే హెరిటేజ్ సంస్ధపై వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు…

హెరిటేజ్ చేసిన తప్పేంటని ప్రశ్నించారు… నాగార్జున యూనివర్శిటీకి సమీపంలో కొంత భూమిని సంస్థ కొనుగోలు చేసిందని అన్నారు… అందులో తప్పేంటని అన్నారు… వ్యాపార సంస్థ విస్తరణలో దేశంలో ఉన్న వివిధ ప్రాంతాల్లో భూములను కొందని అన్నారు… హెరిటేజ్ కొన్న భూమి క్యాపిటల్ పరిధిలో లేదని అన్నారు చంద్రబాబు…