జగన్ ఎఫెక్ట్… రాజకీయాలకు గుడ్ బై చెప్పిన కీలక నేత

జగన్ ఎఫెక్ట్... రాజకీయాలకు గుడ్ బై చెప్పిన కీలక నేత

0

పర్చూరి నియోజకవర్గానికి వైసీపీ తరపున ఇంచార్జ్ గా రవి రామనాధబాబు పేరు దాదాపు ఖాయం అయినట్లేనని వార్తలు వస్తున్నాయి… ఇటీవలే జగన్ మోహన్ రెడ్డి ప్రకాశం జిల్లా పర్యటనలో భాగంగా నాడు నేడు కార్యక్రమం ప్రారంభించారు…

ఈ కార్యక్రమానికి రవి రామనాధబాబు పాల్గొన్నారు… ఆయన సీఎం ముందు కూర్చున్న సంగతి తెలిసిందే… దీంతో పర్చూరి ఇంచార్జ్ వ్యవహారానికి ఎండ్ కార్డ్ పడిందని అంటున్నారు… అధికారికంగా ప్రకటించక పోయినప్పటికీ రామనాధబాబు ఇంచార్జ్ గా ఫిక్స్ అని వైసీపీ నాయకులు అంటున్నారు…

దీంతో దగ్గుబాటి వెంకటేశ్వరరావు మరోసారి ప్రత్యక్షరాజకీయాలకు గుడ్ బై చెప్పినట్లే అని ప్రచారం సాగుతోంది… గత ఎన్నికల్లో వైసీపీ తరపున ఆయన పోటీ చేసి ఓటమి చెందారు… ఆయన భార్య పురందేశ్వరి బీజేపీ తరపున ఏంపీగా పోటీ చేసి ఓటమి చెందిరు…