జగన్ గురించి మాట్లాడితే నాలుక కోసేస్తా… మంత్రి నాని హెచ్చరికలు..

జగన్ గురించి మాట్లాడితే నాలుక కోసేస్తా... మంత్రి నాని హెచ్చరికలు..

0

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అలాగే మాజీ మంత్రి దేవినేని ఉమాపై మంత్రి కొడాలి నాని మరోసారి ఫైర్ అయ్యారు… చంద్రబాబు నాయుడు శవరాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.. తాజాగా ఆయన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… ఎవరైనా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గురించి మాట్లాడితే నాలుక కోసేస్తానని హెచ్చరించారు..

గతంలో ఎమ్మెల్యే అవ్వడం కోసం సొంత వదినని చంపిన చరిత్ర దేవినేని ఉమాది అని మండిపడ్డారు… ఉమాకు ఏ అర్హత ఉందని ఇరిగేషన్ మంత్రి చేశారని ప్రశ్నించారు… ప్రస్తుతం ప్రజలకు కావాల్సింది విమర్శలు కాదని భరోసా అని అన్నారు… టీడీపీ నేతలు కరోనా పోరాటంలో కలిసిరాకపోగా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు నాని…

గతంలో చంద్రబాబు నాయుడు ప్రచార ఆర్భాటాలు చేశారని ఆరోపించారు… చంద్రబాబు నాయుడు చేతిలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కీలుబొమ్మ అని ఆరోపించారు… వ్యవస్థలు బాగుపడాలంటే నిమ్మగడ్డలాంటి వారిని తీసేయ్యాలని అన్నారు..