జగన్ కాళ్లు పట్టుకుంటా- జలీల్ ఖాన్

జగన్ కాళ్లు పట్టుకుంటా- జలీల్ ఖాన్

0

ప్రస్తుతం ఏపీలో మూడు రాజధానుల వ్యవహారం హీటెక్కుతోంది… ఇన్ సైడర్ ట్రేడింగ్ పేరుతో గతంలో టీడీపీ నాయకులు అక్రమంగా తక్కువ ధరలకు అనుకూలంగా ఉన్న వారి పేర్లమీద అలాగే బినామీ పేర్లమీద భుములు కొన్నారని వైసీపీ ఆరోపిస్తోంది…

మరోవైపు అమరావతి మార్చడానికి వైసీపీ నాయకులు ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటూ డ్రామాలు ఆడుతున్నారని ఆపిస్తోంది టీడీపీ… ఈ క్రమంలో ఒకరిపై ఒకరు మాటల యుద్దం చేసుకుంటున్నారు… ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు…

రాష్ట్రంలో పాలన మొత్తం ఒక చోట నుంచే సాగాలని అన్నారు… మూడు రాజధానుల నిర్ణయం సరికాదని అన్నారు… అమరావతి రైతులు పట్ల వైసీపీ సర్కార్ అమానుషంగా ప్రవర్తిస్తోందిన అన్నారు… రాజధాని మార్చకుండా ఉంటే జగన్ కు పాదాభివందనం చేస్తానని తెలిపారు జలీల్ ఖాన్… జగన్ ను చూసి ఉద్యోగస్తులు భయపడుతున్నారని అందుకే మౌనంగా ఉన్నారని అన్నారు…