జగన్ కు లోకేశ్ సూటి ప్రశ్న సమాధానం ఇస్తారా…

జగన్ కు లోకేశ్ సూటి ప్రశ్న సమాధానం ఇస్తారా...

0

మద్యపాన నిషేధం కోసం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముందడుగు వేస్తూనే ఉన్నారని లోకేశ్ అన్నారు. దాని ఫలితమే రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని లోకేశ్ మండిపడ్డారు.

గ్రామాల్లో బెల్టు షాపులు పుట్ట గొడుగుల్లా వెలుస్తున్నాయి. జగనన్న మద్యం దుకాణాల్లో రేటు పెంచి వైసీపీ మార్క్ దోపిడీని యధావిధిగా కొనసాగిస్తున్నారరి లోకేశ్ ఆరోపించారు…

అయితే ఇంత జరుగుతున్నా షాపులు తగ్గించాం, బార్లు తగ్గించడానికి శ్రమిస్తున్నాం అంటూ ఉపన్యాసాలు ఇస్తున్న మిమ్మల్ని సూటిగా అడుగుతున్నా.. గతంలో కంటే ఒక్క క్వార్టర్ బాటిల్ అమ్మకం తగ్గిందా చెప్పండి అని లోకేశ్ ప్రశ్నించారు…