జగన్ కు రెడ్ హ్యాండెట్ గా దొరికిన పవన్

జగన్ కు రెడ్ హ్యాండెట్ గా దొరికిన పవన్

0

కొద్దిరోజుల క్రితం అనంతపురం జిల్లాలో జాతీయ జెండాకు వైసీపీ రంగులు వేయడంపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే…. అయితే ఈ ఘటన మరువక ముందే మరో ఘటన చోటు చేసుకుంది…

విజయనగరం జిల్లాలో జాతిపిత మహాత్మగాంధీ విగ్రహానికి వైసీపీ రంగులు వేశారని పవన్ కళ్యాణ్ ప్రశ్నించిన సంగతి తెలిసిందే…. అయితే దీనిపై వైసీపీ క్లారిటీ ఇచ్చింది…. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దత్త పుత్రుడు పవన్ కళ్యాణ్ నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడింది వైసీపీ…

ఆయన ట్వీట్ చేసిన ఫోటులు ఫేక్ అని చెప్పారు వైసీపీ నాయకులు… అధికారం కోల్పోవ‌డాన్ని ప‌చ్చ‌పార్టీ నేత‌లు జీర్ణించుకోలేక‌పోతున్నారని మండిపడింది వైసీపీ. దీంతో వీరు ఎంత‌గా దిగ‌జారిపోయారంటే గాంధీజీ విగ్ర‌హానికి ఉండే దిమ్మెకు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగులు వేసి చూడండ‌హో అంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా దండోరా వేస్తున్నారని ఆరోపించింది…