రాజీనామా చేస్తావా లేక బలవంతగా తోసెయ్యాలా జగన్ సర్కార్ అల్టిమేటమ్ జారీ

రాజీనామా చేస్తావా లేక బలవంతగా తోసెయ్యాలా జగన్ సర్కార్ అల్టిమేటమ్ జారీ

0

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్ మెహన్ రెడ్డి సర్కార్ టీడీపీకి అల్టిమేటమ్ జారీ చేసింది. గత ప్రభుత్వం తరపున వర్ల రామయ్య ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ గా ఉన్నారు… అయితే ఈ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది.

అయినా కూడా వర్ల రామయ్య చైర్మెన్ పదవికి రాజీనామా చేయలేదు దీంతో జగన్ సర్కార్ ఆయనకు నెల రోజులు సమయం కేటాయించింది… నెలరోజుల్లో ఆయన తన పదవికి రాజీనామా చేయకపోతే పదవి నుంచి ప్రభుత్వం తొలగిస్తుందని పేర్కొంది. ఈ మేరకు ఆయనకు నోటీసులు కూడా జారీ చేశారు అధికారులు…

గతంలో ఇదే పరిస్థితిని టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ తెచ్చుకున్నారు… వైసీపీ అధికారంలోకి వచ్చినా ఆయన పదవికి రాజీనామా చేయకపోవడంతో బలవంతగా తప్పించారు. ఇప్పుడు ఇదే పరిస్థితి వర్ల తెచ్చుకుంటారా లేక నోటీసులప్రకారం రాజీనామా చేస్తారా అనేది చూడాలి.