పవన్ కు ఫుల్ స్టాప్ పెట్టిన జగన్ సర్కార్…. డోంట్ రిపీట్

పవన్ కు ఫుల్ స్టాప్ పెట్టిన జగన్ సర్కార్.... డోంట్ రిపీట్

0

ఇటీవలే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న విమర్శలకు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తాజాగా ఫుల్ స్టాప్ పెట్టింది… వైసీపీ పై విమర్శలు చేసేముందు ఆలో చించుకుని విమర్శలు చేయాలని పవన్ కు సలహాలు ఇచ్చింది వైసీపీ…

తాజాగా అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ… జగన్ పై విమర్శలు చేసేముందు పవన్ కళ్యాణ్ రెండుచోట్లు పోటీ చేసిన నియోజకవర్గాల్లో ఎందుకు ఓటమి చెందారో ముందు తెలుసుకోవాలని అన్నారు… ఆయన ఓటమి చెందిన రెండు చోట్ల ఇప్పటి వరకు ముఖం చూపించలేదని ఎద్దేవా చేశారు అంబటి…

తమ నేత రాష్ట్ర విభజన, పోలవరం రివర్స్ టెండరింగ్ కు సంబంధించి విషయాలపై కేంద్రంతో చర్చించేందుకు వెళ్తే పవన్ విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు… 175 అసెంబ్లీ సీట్లకు గాను 151 అసెంబ్లీ సీట్లతో ప్రజలు గెలిపించుకుని ముఖ్యమంత్రిని చేసుకున్న జగన్ ను పవన్ కళ్యాణ్ ప్రశ్నించే అర్హత లేదని అన్నారు.. చంద్రబాబు నాయుడు డీఎన్ఎ పవన్ డీఎన్ఎ ఒక్కటే నని అన్నారు…