దగ్గుబాటి ఫ్యామిలీకి అల్టిమేటమ్ జారీ చేసిన జగన్ సర్కార్

దగ్గుబాటి ఫ్యామిలీకి అల్టిమేటమ్ జారీ చేసిన జగన్ సర్కార్

0

ఏపీ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇటీవలే దగ్గుబాటి ఫ్యామిలీకి అల్టిమేటమ్ జారీ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.. ఉంటే వైసీపీలో ఉండాలని లేదంట బీజేపీలో ఉండాలని హెచ్చరిస్తోందట… భార్య బీజేపీలో భర్త వైసీపీలో ఉండటం మంచిదికాదని తెలియజేస్తున్నారట…

జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత బీజేపీ నాయకులు సర్కార్ పై అనేక విమర్శలు చేస్తున్నారు. అందులో భాగంగా పురందేశ్వరి కూడా జగన్ పై విమర్శలు చేశారు… ఇక ఈ వ్యవహారం పార్టీలో కాస్త కాక పుట్టించింది ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో కాస్త ఇబ్బందిగా అనిపిస్తుందని దీంతో మరికొద్దిరోజుల్లో దగ్గుబాటిఫ్యామిలీ ఏపార్టీలో ఉండాలో తేల్చుకోవాలని వైసీపీ సర్కార్ అల్టిమేటమ్ జారీ చేసిందట… .

కాగా ఎన్నికల సమయంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆయన కుమారుడు వైసీపీలో చేరారు ఆయన భార్య బీజేపీలో ఉండి విశాఖ ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందారు..