ఇసుక కొరతకు జగన్ డెడ్ లైన్…. ఇక డోంట్ రిపీట్…

0

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విశాఖలో చేపట్టిన లాంగ్ మార్చ్ కు ఏపీ సర్కార్ దిగొచ్చింది… ఇసుక కొరతపై ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ… ఈ సమస్య తాత్కాలికమే అని అన్నారు…..

దీనికి నవంబర్ నెలాఖరులోగా స్వస్తి చెబుతామని అన్నారు… ప్రస్తుతం వరదల కారణం వల్ల ఇసుక కొరత ఏర్పడిందని అన్నారు… రాష్ట్ర వ్యాప్తంగా 265 రీచ్ లు ఉంటే అందులో 61 రీచ్ ల్లో మాత్రమే ఇసుక ఉందని అన్నారు… దీనివల్ల ఇసుక కొరత ఏర్పడిందని అన్నారు జగన్…

ప్రస్తుతం కృష్ణా, గోదావరి, పెన్నా నదిలు 90రోజులుగా వరదలతో నిండిపోయి ఉన్నాయని అన్నారు… దీని ద్వారా ఇసుక సమస్య వచ్చిందని అన్నారు… గత ప్రభుత్వంలో ఇసుక మాఫియా నడిచిందని అన్నారు… కానీ తమ ప్రభుత్వంలో తక్కువ ధరకే ఇసుక పంపిణీ చేస్తామని అన్నారు జగన్