జగన్ టార్గెట్ అదొక్కటే

జగన్ టార్గెట్ అదొక్కటే

0

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ను అవినీతిలేని ఆంధ్రప్రదేశ్ గా అభివృద్ది చేయడమే లక్ష్యంగా చేసుకున్నారని మంత్రి రామచంద్రారెడ్డి అన్నారు… అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను కూడా సిద్దం చేస్తున్నారని అన్నారు…

అందులో భాగంగానే అవినీతిలేని పాలన కోసం డయల్ 14400 కాల్ సెంటర్ ప్రారంభించారని అన్నారు… తాజాగా ఆయన ఓ కార్యక్రమానికి పాల్గొన్నారు… ఆ కార్యక్రమంలో మాట్లాడుతూ…

ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన అన్ని హామీలను అమలు చేస్తున్నారని తెలిపారు… నవరత్నాల ద్వారా పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామని అన్నారు… తమ పరిపాలనను చూసి టీడీపీ నాయకులు ఓర్వలేక పోతున్నారని ఆయన ఆరోపించారు…