దగ్గుబాటి ఫ్యామిలీకి జగన్ పెద్ద పరీక్ష

దగ్గుబాటి ఫ్యామిలీకి జగన్ పెద్ద పరీక్ష

0

ఏపీ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గుబాటి వెంకటేశ్వర రావుకు గతంలో అల్టిమేటం జారీ చేసినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే… దగ్గుబాటి ఫ్యామిలీ మొత్తం ఒకే పార్టీలో ఉంటే బాగుంటుందని సూచించారట.

ఇదే విషయాన్ని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా స్పష్టం చేశారు… ఫ్యామిలీ మొత్తం ఒకే పార్టీలో ఉండాలని దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు జగన్ సూచించారని తెలిపారు… అయితే ఈ విషయంలో తుది నిర్ణయం దగ్గుబాటి వెంకటేశ్వరరావుదేనని తెలిపారు…

రానున్న వారం రోజుల్లో పర్చూరి విషయంలో స్పష్టత వస్తుందని అన్నారు… కాగా గత ఎన్నికల్లో వెంకటేశ్వరరావు వైసీపీ తీర్థం తీసుకుని పర్చూరి నుంచి పోటీ చేసిన సంగతి తెలిసిందే .

ఆయన భార్య బీజేపీ తరపున విశాఖ ఎంపీ స్ధానంలో పోటీ చేసి ఓటమి చెందారు… వాప్తవానికి వారసుడు చెంచురాం పర్చూరులో వైసీపీ తరపున పోటీ చేయాల్సి ఉండగా ఆయనకు అమెరికా పౌరసత్వం ఉండటంతో వెంకటేశ్వరరావు పోటీ చేసి ఓటమి చెందారు..