జగన్ మూడు ముక్కలాట

జగన్ మూడు ముక్కలాట

0

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడుముక్కలాటతో రైతులు ఆందోళనతో చనిపోతున్నారని టీడీపీ నేత లోకేశ్ మండిపడ్డారు. రైతు కూలీ నందిపాటి గోపాలరావుగారు మృతి చెందిన ఘటన నన్ను తీవ్రంగా కలచి వేసింది.

జై అమరావతి అన్నందుకు మహిళల పై పోలీసులతో దాడులు చేయించడం దారుణం అని ఆరోపించారు. పోలీసు బూట్లతో అమరావతిని తొక్కేద్దాం అనుకుంటున్న జగన్ మోహన్ రెడ్డి కల నెరవేరదని అన్నారు

రాష్ట్ర విభజనతో ఏపీ ఒకసారి నష్ట పోయిందని ఇప్పుడు మరోసారి రాజధాని విభజనతో రాష్ట్రానికి తీరని నష్టం చెయ్యడానికి
జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు…. అభివృద్ధి ప్రణాళిక లేకుండా కేవలం రాజధాని విభజనతో ఏం సాధించాలనుకుంటున్నారని ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగట్టడం తప్ప, సాధించింది ఏముందని ప్రశ్నించారు…