జగన్ కు లోకేశ్ భారీ హెచ్చరికలు

జగన్ కు లోకేశ్ భారీ హెచ్చరికలు

0

గతంలో పాదయాత్రలో భాగంగా సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని జగన్ చెప్పారని గుర్తు చేశారు లోకేశ్. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇళ్ల మధ్యలోనే జగనన్న సారా దుకాణాలు తెరుస్తున్నారుని ఎద్దేవా చేశారు.

ఇంట్లో కాలేజ్ కి వెళ్లే అమ్మాయిలు ఉన్నారు, పిల్లలున్నారు, ఇక్కడ మద్యం దుకాణాలు వద్దు మహాప్రభో అని మహిళలు వేడుకుంటున్నా జగన్ మోహన్ రెడ్డికి కనికరించడం లేదా అని లోకేశ్ ప్రశ్నించారు.

ఇటీవలే ఇళ్ల మధ్యలో మద్యం దుకాణాలు వద్దు అని ఆందోళన చేసినందుకు మహిళలు అని కూడా చూడకుండా రోడ్డు మీదకు ఈడ్చి కొట్టిస్తారా అని ప్రశ్నించారు మద్యపాన నిషేధం పేరుతో మోసం చేసిన మిమల్ని మహిళలు నిషేధించడం ఖాయం జగన్ అని లోకేశ్ హెచ్చించారు!