పవన్ కు షాక్ మరో కీలక నేత జనసేనకు గుడ్ బై…

0

జనసేన పార్టీలో నేతల సంఖ్య క్రమ క్రమంగా తగ్గుతూ వస్తోంది… 2024 ఎన్నికలలోపు పార్టీపై ప్రజలకు నమ్మకం తీసుకువచ్చేందుకు అధినేత పవన్ కళ్యాణ్ ఒక పక్క ప్రయత్నాలు చేస్తుంటే మరోపక్క నేతలు తమ దారి తాము చూసుకుంటున్నారు…

ఇప్పటికే చాలామంది నేతలు ఇతర పార్టీల్లోకి చేరిన సంగతి తెలిసిందే… ఇక ఇదే క్రమంలో మరో కీలక నేత జనసేనకు గుడ్ బై చెప్పారు.. జనసేన పార్టీకి ఎక్కువ బలం ఉన్న విశాఖ జిల్లాలో సీనియర్ నేత పసుపులేటి బాలరాజు రాజీనామా చేశారు.

తన రాజీనామా లేఖను పార్టీ కార్యాలయానికి అందజేశారు ఆయన… గత ఎన్నికల్లో ఆయన పాడేరు నుంచి పోటీచేసి ఓటమి చెందారు… ఆ తర్వాత నుంచి జనసేన పార్టీ అధినేత పవన్ చేపట్టిన కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చారు… కాగా తాను ప్రజలకు ఉపయోగపడే ఏ పార్టీలో అయినా తాను చేరుతానని స్పష్టం చేశారు పసుపులేటి…