జనసేన ఎమ్మెల్యే ఉగ్ర రూపం.

జనసేన ఎమ్మెల్యే ఉగ్ర రూపం.

0

జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలపై ఉగ్రరూపం చూపారు… అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ అధ్యక్షా గతంలో చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగా అని అన్నారని ఆ తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వ్యవసాయానికి ప్రాధాన్యాత ఇచ్చారని ఇప్పుడు ఆయన కుమారుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా వ్యవసాయానికి పెద్ద పీట వేస్తున్నారని రాపాక అన్నారు…

తండ్రిలాగే జగన్ కూడా రైతులను కాపాడుతున్నారని అందులో భాగంగానే రైతు భరోసా కింద రైతులకు 15 వేల రూపాయాలు ఇచ్చారని తెలిపారు…. ఒక ముఖ్యమైన అంశంపై చర్చజరుగుతుంటే టీడీపీ నాయకులు సభను గందరగోళం పట్టించారని ఆరోపించారు…

ఇది చాలా దారుణం అని ఆయన అన్నారు… గతంలో కూడా తాను శాసన సభ్యుడుగా ఉన్నానని గతంలో ఇంతలా టీడీపీ నాయకులు ప్రవర్తించలేదని ఈ సారి స్పీకర్ చైర్ ను అవమానిస్తూ స్పీకర్ ను కొట్టేవిధంగా ప్రవర్తించారని ఆయన ఆరోపించారు… దీనిపై చర్యలు తీసుకోవాలని అన్నారు..