జనసేనలో కనిపించని మహిళలు…

జనసేనలో కనిపించని మహిళలు...

0

ఏపీలో ఉవ్వెత్తున ఎగసిన జనసేన పార్టీ తాలూకు విభాగాలు ఒక్కొక్కటిగా కనుమరుగవుతున్నాయనే టాక్ వినిపిస్తోంది.. ఇప్పటికే యువసేన తాలూక జాడలుకనిపించకున్నాయి… పవన్ ప్రారంభించిన పార్టీలో జిల్లాల వారీగా పరీక్షలు నిర్వహించి తిలివైన చాకులాంటా యువతను యువసేనగా అపాంట్ చేసుకున్నారు.. ఎన్నికల సమయంలో వీరిని ఐటీ సహకారంగా వాడుకున్నారు..

అయితే ఎన్నికల్లో ఘోర పరాజయం కారణంగా ఈ వింగ్ ను ఎత్తేశారు… దీంతో దాదాపు వేలాది మంది యువసేన కార్యకర్తలు బయటకు వచ్చారు. వీరంతా కూడా జగన్ ప్రభుత్వం తీసుకున్న సచివాలయాల్లో వాలంటీర్లుగా సెక్రటరీలుగా ఉద్యోగాలు పొంది వాటిలో పని చేస్తున్నారు… ఒక సీనియర్లు వృద్దులు మాత్రమే పార్టీలో ఉన్నారు.. ఇక వీరి సంగతి పక్కన పెడితే పవన్ ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన వీర మహిళ కాన్సెప్ట్ కూడా ఇదే తరహాలో నిర్విర్యం అయిందనే వార్తలు కూడా వస్తున్నాయి…

ఎన్నికల ముందు వీర మహిళ అనే విభాగం ఏర్పాటు చేశారు పవన్… ఈ విభాగంలో అన్నిజిల్లాల్లో చదువుకున్న మహిళలను ఇందులో చేర్చారు… అయితే ఎన్నికల తర్వాత ఈ విభాగం కూడా కనుమరుగైందని చర్చించుకుంటున్నారు… పవన్ పార్టీ నేతలతో భేటీ అవుతున్నా ఇటీవలే కాలంలో వీర మహిళలతో మీటింగ్ పెట్టకున్నారనే విమర్శలు వస్తున్నాయి…