వైసీపీలోకి జేసీ బ్రదర్స్ అందుకేనా ఈ కామెంట్స్

వైసీపీలోకి జేసీ బ్రదర్స్ అందుకేనా ఈ కామెంట్స్

0

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 100 రోజుల పరిపాలనపై తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు… జగన్ మోహన్ రెడ్డి 100 రోజుల పాలనకు వందకు వందమార్కులు పడాల్సిందే అని అన్నారు జేపీ.

ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు టీడీపీ ప్రకంపనలు రేపుతున్నాయి…. ప్రతిపక్షంలో ఉండి అధికార నాయకులను విమర్శించకుండా పొగడటం ఏంటని తమ్ముళ్లు వాపోతున్నారు…. పైగా జగన్ మోహన్ రెడ్డి కోరితే సలహాలు కూడా ఇస్తామని చెప్పాడు.

అంతేకాదు మమ్మల్ని అడిగితే తప్పకుండా వెళ్తానని అన్నారు. కానీ పిలవకుండా వెళ్తే ఎవరు రమ్మన్నారని అంటారు. అయినా మమ్మల్ని ఎవరు రమ్మంటారు అని అన్నారు. జేసీ ఇలా ఇన్ డైరెక్ట్ గా చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఆయన త్వరలో వైసీపీలో చేరేందుకుసిద్దమయ్యారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.