జేసీ యూటర్న్ నిన్న బీజేపీ ఇప్పుడు వైసీపీ ఎందుకీ ఈ మార్పు

జేసీ యూటర్న్ నిన్న బీజేపీ ఇప్పుడు వైసీపీ ఎందుకీ ఈ మార్పు

0

తెలుగుదేశం పార్టీ అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి…. ఈ పేరు రాష్ట్ర ప్రజలకు సుపరిచితమే… 1985 లో రాజకీయ అరంగేట్రం చేసినప్పటినుంచి 2014 ఎన్నికల వరకు తాడిపత్రిని తన అడ్డాగా మార్చుకున్న జేసీ బ్రదర్స్ పలు విషయలపై స్పందిస్తూ సంచలనంగా మారుతుంటారు…

2019 ఎన్నికల్లో జగన్ సునామితో టీడీపీ ప్రతిపక్షంలోకి చేరిన తర్వాత చంద్రబాబు నాయుడును టార్గెట్ చేశారు జేసీ. ఇటీవలే ప్రధాని మోదీని పొగుడుతూ చంద్రబాబు నాయుడుపై పలు వ్యాఖ్యలు చేశారు జేసి. ఇదే క్రమంలో జగన్ సర్కార్ పై కూడా స్పందించారు…

ఇటీవలే జగన్ ప్రభుత్వానికి 100కు 110 మార్కులు వేసీ జేసీ తాజాగా పోలవరం రివర్స్ టెండరింగ్ పై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు.. రివర్స్ టెండరింగ్ లో ప్రభుత్వం ధనం ఆదా అయితే స్వగతించాల్సిన విషయం అని అన్నారు.. తక్కువ ఖర్చుతో ప్రాజెక్టులు నిర్మించడం మంచిదే అని అన్నారు.. అలాగే రివర్స్ టెండరింగ్ పాత కాంట్రాక్టర్లకే దక్కడం సంతోషమని అన్నారు.. అయితే కాంట్రాక్టర్లతో ప్రభుత్వం కుమ్మక్కు అయితే అది పెద్ద తప్పు అని అన్నారు జేసీ…